రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు ఒకే డాక్టర్ !!!

Published: Thursday October 07, 2021
హైదరాబాద్, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మానవదేహంలో అన్నీ ఉన్నా గుండె పాత్ర గుండెదే, అలాగే ఆసుపత్రిలో ఎంతమంది సిబ్బంది ఉన్నా డాక్టర్ లేకుండా ఏ పని ముందుకు సాగదు. సనత్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. సనత్ నగర్ అంటేనే పేద ప్రజలు అధికంగా నివసించే చోటు అలాంటి చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేకపోవడంతో ప్రక్కనున్న ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రెండు హాస్పిటల్ లను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. అయితే ఆసుపత్రిలో సిబ్బంది, మందులకు కొరత లేకున్నా ముఖ్యమైన డాక్టర్ లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉండడం గమనార్హం. స్థానిక డివిజన్ వైద్యాధికారిని వివరణ కోరగా ఆ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసిన డాక్టర్ వినాయక రావు ప్రమోషన్ పై బదిలీ అయి నెల రోజుల వరకు అవుతుందని, ఆర్ బి ఎస్ కె డాక్టర్ లతో ప్రస్తుతం సేవలు కొనసాగిస్తున్నట్లు, పక్కనున్న ప్రభుత్వాసుపత్రి డాక్టర్ ఈ హాస్పిటల్ ను కూడా చూస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న సనత్ నగర్ లో ప్రభుత్వాస్పత్రికి పర్మినెంట్ డాక్టర్ లేకపోవడం దయనీయం అంటున్నారు ప్రజానీకం.