నేతకానీ ధూం దాం పోస్టర్లు ఆవిష్కరణ జన్నారం, నవంబర్ 09, ప్రజాపాలన:

Published: Thursday November 10, 2022
ఈనెల 13న చెన్నూరు పట్టణ లో 
తెలంగాణ నేతకాని రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే
 నేతకాని ధూంధాం కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆ సంఘం నాయకులు బుధవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఈ సందర్భంగా తెలంగాణ నేతకాని రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి గంగేష్ 
మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలలో నేతకాని కులస్తులు ఉన్నారని, వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా బతుకుతున్నామని అన్నారు. నేతకాని సంస్కృతి, సంప్రదాయాలు, మరుగున పడిపోయాయని  నేటి తరానికి  తెలియపరిచేందుకు చెన్నూరు నేతకాని ధూంధాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో నేతకాన్ని కుల బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాడి సుధాకర్, మునేసుల గంగాధర్, దుర్గం చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.