కష్టంతో కాదు ఇష్టంతో చదవాలి

Published: Tuesday December 27, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 26 డిసెంబర్ ప్రజా పాలన : లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయం సాధిస్తారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ సబితా ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ మండల, పట్టణ పరిధిలో గల ఉత్తమ మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ బహుమతులను  వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అందజేశారు. 
ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన ప్రజ్వలన అనంతరం వందేమాతరం గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లోని నైపుణ్యతను గుర్తించి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో కృషి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశలో ఇంటర్ మీడియట్ దశ అత్యంత ప్రాముఖ్యమైనదని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాలను గుర్తించుకొని, కష్టమైన ఇష్ట పడి చదువాలని హితవు పలికారు. మీ జీవితాలను మీరే చక్కదిద్దుకొని చెడు వ్యసనాలకు గురి కాకుండా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. వికారాబాద్ లోని పాఠశాలలు  కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన 354 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్డ నోల్ అధికారి శంకర్ వికారాబాద్ మండల ఎంఈఓ బాబు సింగ్ బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి శివారెడ్డి పెట్ పిఎసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి కౌన్సిలర్లు లంకా పుష్పలత రెడ్డి చిట్యాల అనంతరెడ్డి హెరే కార్ సురేష్ గోపాల్ ముదిరాజ్ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు పాతూరు రాంరెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి మండల పరిషత్ అధికారి మల్గ సత్తయ్య ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.