మార్చి 28,29 సార్వత్రిక సమ్మె కరపత్రం, విడుదల

Published: Friday March 25, 2022
సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
మంచిర్యాల టౌన్, మార్చి 23, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మార్చి 28, 29న జరుగుతున్న సార్వత్రిక సమ్మె కరపత్రాలు, విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్రంలో వివిధ కార్మిక ఉద్యోగ సంఘాలు కలిసి మార్చి 28, 29 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్, స్విపర్ల, పేషంట్ కేర్ లలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని. సాయి ఏజెన్సీ ద్వారా ఈ కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నెల జీతం ఇవ్వకుండా. చాలీచాలని జీతాలతో కార్మికులు ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ఆసుపత్రి అధికారులు కార్మికుల పైన పని భారం మోపుతూ ఒత్తిడికి గురిచేస్తున్నారని. జిల్లాలోని కాంట్రాక్టర్ సకాలంలో జీతం ఇవ్వకపోతే కార్మికులు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున కార్మికులకు జీతం చెల్లించన సాయి ఏజెన్సీను వెంటనే రద్దు చేయాలి. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 26 వేల చెల్లించాలని సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, కార్మికులు కుమార్, నర్సయ్య, దుర్గయ్య, క్రాంతి విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.