బిఎస్పి అధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

Published: Wednesday March 29, 2023

శంకరపట్నం మార్చి 28 ప్రజాపాలన రిపోర్టర్:


బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవారం బీఎస్పీ మండల అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని యువకులు, విద్యార్థులు, సబ్బండ వర్ణాలు పోరాటం చేశాయని, కానీ సాధించిన తెలంగాణలో ఒక్క ముఖ్యమంత్రి కెసిఆర్ వారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి న్యాయం జరగలేదని, పైపెచ్చు వేయక వేయక ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తే అట్టి పరీక్షలలో అవకతవకలు జరిగాయని, అట్టి వాటికి కారణమైన ప్రభుత్వం నేటికీ స్పందించకపోవడం సిగ్గుచేటనీ, తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటాలు ఆపమని, ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించాలని లేని పక్షంలో మరో సారి తెలంగాణ ఉద్యమాన్ని పునరావృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జీ కుమ్మరి సంపత్, మండల అధ్యక్షులు దేవునురి భాస్కర్, ప్రధాన కార్యదర్శి సంపత్, మండల మైనార్టీ కన్వీనర్ మహ్మద్ మగ్ధుం అలీ, సీనియర్ నాయకులు సందేల వెంకన్న, చింతకుంట గ్రామ కన్వీనర్ అడేపు సంపత్, మహంకాళి ఎల్లయ్య, సందీప్, అంజీ, తదితరులు పాల్గొన్నారు.