వారోత్సవాలను ప్రారంభించిన ఎంపీపీ దొడ్డా, సర్పంచ్ మమత..

Published: Wednesday August 03, 2022

తల్లాడ, ఆగస్టు 2 (ప్రజాపాలన న్యూస్):

*తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు వెంటనే మర్రిపాలు పట్టించాలని, అవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అభి భూనిషా, స్కూల్ హెచ్ఎం లు రమేష్, సరోజిని, అంగన్వాడి టీచర్లు కోపెల మీనాకుమారి, సైదమ్మ, నాగేంద్ర, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.*