చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కె.సి.ఆర్ ఆదేశం

Published: Monday March 29, 2021
కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం నాగ పల్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రామస్థులతో ముచ్చటిస్తూ సాగునీటి అవసరాల కోసం చివరి ఆయకట్టుకు నీరు అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ను కోరగా వెంటనే స్పందించి సాగు నీరు అందించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలియజేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆర్ ఆర్ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి సాగునీరు అందించాలని తెలియజేశారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలోని డి.60, డి.64 కెనాల్ ద్వారా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం డి.60, డి.64 కెనాల్ ద్వారా గొల్లపల్లి మండలం లో ఉన్నటు వంటి ఆయకట్టు కు అదేవిధంగా డి.53, డి.54 కెనాల్ ద్వారా బుగ్గారం మండలం, డి.83 కెనాల్ ద్వారా ధర్మారం, వెల్గటూర్ మండలాల ఆయకట్టు కు డి.86 ద్వారా పెద్దపల్లి, ఓదెల శ్రీరాంపూర్, మంథని ప్రాంతాలకు పంటలకు చివరి ఆయకట్టు కు నీరు అందడం లేదు, కెనాల్ నీరు తక్కువగా వస్తాయి. పొలాలు పొట్టదశ వచ్చాయి. నీరు అందక పొలాలు ఎండిపొయే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వివరించగా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులను ఆదేశించి వార బంది లేకుండా ఆయకట్టు రైతులను నీటిని అందించాలని ఆదేశించడం జరిగింది. సంతోషంగా గ్రామస్తులతో ముచ్చటిస్తూ ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ కూనమ్మ లక్ష్మీ లింగయ్య జడ్పిటిసి బి. సుధారాణి రామస్వామి, సర్పంచ్ మీరు కొమురయ్య ఎంపిటిసి సప్త జ్యోతి రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఏలేటి కృష్ణారెడ్డి, తెరాస మండల శాఖ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్ ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, నాగ పల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు పూదరి రమేష్, కార్యదర్శి అల్గునూరి సతీష్, ఉప సర్పంచ్ పూదరి రాజేందర్,ధర్మ కర్తలు దాసారాపు రామచంద్రరావు, అన్నమనేని గజేంద్ర రావు, గౌరీ లక్ష్మీనారాయణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కుమ్మరి వెంకటేష్, గుడికందుల సత్యం తదితరులు పాల్గొన్నారు.