నియోజకవర్గ ప్రజలు సహస్ర చండీయాగానికి తరలి రావాలి* *యాగానికి సకల ఏర్పాట్లు పూర్తి*

Published: Thursday August 18, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం, మండలం పరిధిలోని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన సహస్ర చండీయాగం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి . నేటి నుండి ఐదు రోజుల పాటు ఎమ్మెల్యే స్వగ్రామం ఎలిమినేడులో తన వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగం నిర్వహించ చున్నారు . చండీయాగం నిర్వహణ ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవే క్షిస్తున్నారు . యాగశాల , అతిదుల వసతి , భక్తుల వసతి తదితర ఏర్పా ట్లు పూర్తి కావచ్చాయి. గత ఏడేండ్ల క్రితం ఇదే స్థలంలో శతచండీయాగం విజయవంతంగా నిర్వహించిన ఎమ్మెల్యే , తిరిగి అదే స్థలంలో సహస్రచండీయాగం నిర్వహించనున్నారు . ఎమ్మెల్యే తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి యాగం ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు , యాగానికి రామన్న అతిదులకు , భక్తులకు తగిన వసతులు కల్పించే పనులను పురమాయిస్తున్నారు. సహస్ర చండీయాగానికి సిఎం కెసిఆర్ , మంత్రులు , శాసనసభ్యులు , పార్లమెంటు సభ్యులు , శాసన మండలి సభ్యులను , స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను , మహిళాసంఘాల సభ్యులను ఎమ్మెల్యే స్యయంగా ఆహ్వానించారు. యాగంలో ప్రతిరోజు  ఉదయంనుండి హామం నిర్వహించి , సాయంత్రం దేవతామూర్తుల క్యుణోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నుండి 40 మంది ఋత్విక్కులు ఈ యాగంలోపాల్గొననున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు . నియోజకవర్గ ప్రజలు , మహిళలు, భక్తులు , అధికారులు, యువతరం యాగంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగాలరని ఎమ్మెల్యే ఆకాంక్షించారు . మంత్రులు , విఐపిలు పాల్గొనడడంతో ఎసిపి టీ మామహేశ్వర్ రావు , సి ఐ సైదులు , ట్రాఫిక్ సి ఐ మహేష్ తదితరులు పార్కింగ్ , ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీపీ కృపేష్ , మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి , మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి, వైస్ ఎంపిపి మంచిరెడ్డి పుతాప్ రెడ్డి, మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి , కౌన్సిలర్లు ముత్యాల లక్ష్మీ ప్రపన్న , భర్తాకి జగన్ , భరతకుమార్ , టిఆర్ఎస్ నాయకులు ముత్యాల చిన్న , యాచారం రవిందర్, మల్లేశ్ యాదవ్, జెర్కొని రాజు,  కె.వి రమెష్ రాజు తదితరులు పాల్గొన్నారు . 
 
 
 
Attachments area