పంట పొలాలు పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారులు

Published: Monday March 13, 2023
ఎర్రుపాలెం మార్చి11 ప్రజాపాలన ప్రతినిధిఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో సాగవుతున్న పంటలను, వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేస్తున్న 9 పంటల ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎం విజయనిర్మల పరిశీలించారు. ప్రస్తుతం వరిలో అగ్గి తెగులను, మొక్కజొన్నలు కత్తెర పురుగును గమనించడం జరిగిందని వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేశారు. నత్రజని ఎరువును మోతాదుకు మించి వాడడం వల్ల వరిలో అగ్గి తెగులు వ్యాప్తి చెందుతుందని కావున నత్రజని ఎరువును ద్రవరూపంలోమొక్కలకుఅందించినట్లయితే మొక్కలు నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటాయని తెలిపారు. మొక్కలకు  నీటి ఆవశ్యకతను బట్టి తడులను అందించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ కొండూరి విజయ్ భాస్కర్ రెడ్డి వ్యవసాయ సాంకేతిక జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఖమ్మం శ్రీ రాజురేమిడిచర్ల గ్రామ సర్పంచ్ చిన్నం రాజు పురుషోత్తం రాజుసాంబశివరావు, ఏఈవోలు దాత్రి, సాయి ,గ్రామ రైతులు పాల్గొన్నారు