గుర్రంగూడ లో హనుమాన్ జయంతి వేడుకలు

Published: Wednesday April 28, 2021
బాలపూర్, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి: హనుమాన్ జయంతి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. బాలాపూర్ మండలం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కార్పొరేటర్ సమక్షంలో గుర్రం గూడాలోనీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ.... ఇప్పుడున్న పరిస్థితుల్లో మహమ్మారిని తరిమికొట్టాలని అంటే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి అత్యవసరం ఉంటేనే బయటికి రావాలినీ భక్తులందరూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం గూడా కాలనీ వాసులందరూ పాల్గొన్నారు .