సీఎం సహాయ నిధి చెక్కులు స్థానిక బ్యాంకుల్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి... బండ లేమూర్ మాజి స

Published: Monday June 27, 2022

సీఎం సహాయ నిధి చెక్కులు స్థానిక బ్యాంకుల్లో తీసుకొని డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బండ లేమూర్ మాజి సర్పంచ్ పోచమోని కృష్ణ, మాజి ఎంపీటీసీ వట్టి వెంకటేశ్  డిమాండ్ చేశారు. బండలేమూర్ గ్రామానికి చెందిన బద్దుల శ్రీశైలం అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఖర్చులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెళ్లి నర్సిరెడ్డి సహాకారంతో సీఎం సహాయ నిధి మంజూరీ అయిన రు. 23000/ లు చెక్కును ఈ రోజు  కుటుంబభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ అనారోగ్యం పాలై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కు ఇయిన ఖర్చులో కొన్ని డబ్బులు సీఎం సహాయ నిధి నుండి అందించడం వారికి ఆర్థికంగా వెసలుబాటు ఇస్తుంది అని అన్నారు. వైద్యం కోసం ఐయిన ఖర్చులు పూర్తిగా చెల్లిస్తే భాగుంటుందని చెప్పారు.
సీఎం సహాయ నిధి నుండి వచ్చే చెక్కులు స్థానిక బ్యాంకుల్లో తీసుకోకుండా నగరంలో నీ హాబిడ్స్ లోని బ్యాంకులో వేసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. ఆ బ్యాంకు అడ్రస్ దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున సీఎం సహాయ నిధి చెక్కులు స్థానిక బ్యాంకుల్లో తీసుకొని డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జోగు శ్రీనివాస్, సీపీఎం నాయకులు జోగు జగదీష్, జార్పుల కిషన్ నాయక్, వలపు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.