ఆకస్మికంగా అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన బెల్లంపల్లి మునిసిపల్ చైర్మన్ జక్కుల శ్వేత

Published: Thursday December 09, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణం లోని 11వ వార్డ్ లో గల అంగన్వాడీ కేంద్రాన్ని బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నా అంగన్వాడి ఆహార పదార్థాలు గర్భిణీ స్త్రీలకు నాణ్యమైనవిగా ఇస్తున్నారా లేదా అని ఆమె పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పెట్టే ఆహార నాణ్యతను పరిశీలించి వారితో పాటుగా స్వయంగా భోజనం చేశారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.