వేగంగా కొనసాగుతున్న ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం ప్రక్రియ.

Published: Wednesday October 19, 2022

భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం (ప్రజా పాలన)

బూర్గంపాడు మండల  పరిధిలోని సారపాకలో వేగంగా కొనసాగుతున్న ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం అనే ప్రక్రియనీ వేగంగా కొనసాగిస్తున్న బూర్గంపహాడ్ తహసిల్దార్ భగవాన్ రెడ్డి బృందం .BLO లతో వేగంగా ఇట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.వీరితో పాటు పరిశీలనలో తెరాసా మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి ఉన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బూర్గంపహాడ్ రెవెన్యు సిబ్బంది అయిన RI అక్బర్ మాట్లాడుతూ ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అని ఈ సంఖ్య అధారంగానే పౌరులకు సంక్షేమ పథకాలు,బ్యాంకులో ఖాతా తెరవడం,రేషన్ కార్డు పొందాల్సి ఉంటుందనీ,అలాగే అనేక గుర్తింపు కార్ఢులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయిందనీ తాజాగా ఓటరు ID కార్డుతో కూడా ఆధార్ కార్డును లింక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందనీ ఆగస్టు 1 నుండి ఓటరు ID కార్డు,ఆధార్ కార్డు అనుసంధానానికి సంబంధించిన ప్రక్రియ వేగంగానే కొనసాగుతున్నదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సంజీవ రెడ్డి మరియు పలువురు BLO లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .