కంటి వెలుగును విజయవంతం చేయాలి

Published: Wednesday January 11, 2023
మేడిపల్లి, జనవరి10 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 18న నిర్వహించనున్న రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు సమావేశనికి  ముఖ్య అతిథలుగా  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి,జిల్లా కలెక్టర్ హరీష్,
అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జాయింట్ కలెక్టర్ ఏనుగు నర్సింహ రెడ్డి, డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పుట్ల శ్రీనివాస్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి పద్మజారాణి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి,బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా             మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ 
రెండో విడత కంటి వెలుగు  కార్యక్రమాన్ని జిల్లా అధికారులంతా సమన్వయంతో విజయవంతం చేయాలని, ఈ నెల18 నుంచి 
క్యాంపులు నిర్వహించే చోట అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కంటి వెలుగు నిర్వహించే వివరాలను ముందుగానే ఆయా ప్రాంతాల ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వోలు ఆనంద్, నారాయణరావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రఘునాథాస్వామి, డాక్టర్ సరస్వతి జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, మంజుల, 
వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు వివిధ కార్పొరేషన్ల కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,మేడ్చల్ మల్కజ్ గిరి  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు , సిబ్బంది  వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు మరియు మీడియా మిత్రులు , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవికుమార్, రవీందర్ రెడ్డి,పాల్గొన్నారు.