జిల్లా కలెక్టర్ ను సన్మానించిన నాయకులు ** బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు **

Published: Wednesday February 15, 2023
అసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన,ప్రతినిధి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీపై వచ్చిన బొర్కడే హేమంత్ సహదేవ్ రావు ను మంగళవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ఆసిఫాబాద్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ నిసార్, ఎండి అహ్మద్, ఇమ్రాన్, సయ్యద్ అహ్మద్ షా, తదితరులు పాల్గొన్నారు.