ఘనంగా అఖిల భారతీయ యువజన కాంగ్రెస్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Tuesday August 10, 2021
కోరుట్ల, ఆగష్టు 09 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలో అఖిల భారతీయ యువజన కాంగ్రెస్ 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జెండా ఎగుర వేసిన, మిఠాయిల పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఏలేటి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ లో చేరి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అద్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సరికెళ్ల నరేష్, అంజి రెడ్డి, ముహమ్మద్ నసీర్, వాసం అజయ్, ఎంబెరి సత్య నారాయణ, రంజిత్ గుప్త, అర్ఫత్, జెట్టి లక్ష్మణ్, మ్యదరి లక్ష్మన్, చైతన్య, హైమద్ మరియు తదితరులు పాల్గొన్నారు.