ఎన్.సి. న్యాయశాస్త్ర పట్టభద్రులకు 3 సంవత్సరాల పాటు శిక్షణ

Published: Thursday July 01, 2021
జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి పి.రవీందర్రెడ్డి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి,జూన్ 30, ప్రజాపాలన : 2020-21 సంవత్సరానికి గాను అర్హులైన జిల్లాలోని షెడ్యూల్డ్ కులమునకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రులు బార్ అసోసియేషన్ పేరు నమోదై ఉన్న వారికి నాలుగు జిల్లాలకు కలిపి మొత్తం 8 మందికి 3 సంవత్సరాల పాటు న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం జిల్లా ఆఫీసర్కు అటాచ్ చేయడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి పి.రవీందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో నెలకు ఒక వేయి రూపాయల చొప్పున శిక్షణ భృతి, న్యాయశాస్త్ర గ్రంథాలకు, ఫర్నీచర్ కొనుగోలు నిమిత్తం 6వేల రూపాయలు ఒకసారి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి శిక్షణ పొందుటకు 39 సం॥ల లోపు ఎన్.సి. కులమునకు చెందిన న్యాయవాదులు జూలై 12వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా పూర్తి వివరాలతో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో అందించాలని, అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలకు మించి ఉండాలని, ఈ పథకం క్రింద కాని, ఇతర పథకం క్రింద కాని గత సంవత్సరాలలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉండరాదని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.