అంబరాన్ని అంటిన రైతు సంబరం

Published: Monday January 10, 2022
తాండూరులో రైతుబంధు వారోత్సవాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 09 జనవరి ప్రజాపాలన : పంట ధాన్యం తో వేసిన రంగు రంగుల ముగ్గులతో, ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతు వేసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కందులు, మొక్క జొన్న, జొన్న, గోధుమ, గడ్డి నువ్వులు, పెసర్లతో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం విశేషంగా అందరిని ఆకర్షించింది. ర్యాలీ పై పూల వర్షం కురిపించి, దేశానికి అన్నం పెట్టే రైతన్న అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితా రెడ్డికి కృతజ్ఞత చాటిన తాండూరు ప్రజలు. రైతు బంధు 50 వేల కోట్లకు చేరటం తో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో ఎడ్ల బండి ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎడ్ల బండ్లు, భారీగా ట్రాక్టర్ లతో ఘన స్వాగతం పలికిన రైతులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ నినదించిన రైతన్నలు. తాండూరు ప్రధాన రహదారిలో కొనసాగిన ర్యాలీ...ఇళ్ళు, దుకాణాల నుండి మంత్రి సబితా రెడ్డికి అభివాదం చెబుతున్న స్థానికులు, మహిళలు, యువత. ఈ సందర్భంగా తాండూరు రైతు బజార్ లో జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ... రైతు బాంధవుడు కేసీఆర్, రైతు పక్ష పాతిగా ఉంటూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతన్నలో సంతోషం వెల్లివిరిస్తుంది. కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది. అందుకు నిదర్శనమే నేడు తాండూరులో రైతులు జరుపుకున్న సంబురం నిలుస్తుంది. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు ద్వారా ఎకరాకు 10 వేలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరెంట్ రాక, పంటలు ఎండి రైతులకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటే నేడు 24 గంటల విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా రైతుకు అండగా నిలబడుతుంది. ఇప్పటి వరకు 3500 కోట్లు రైతు భీమా అందించిన కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతుల పట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమకు, దార్శనికతకు నిదర్శనమె రాష్ట్రంలో రైతు పథకాలు. రైతు కల్లాలు, రైతు వేదికలు నిర్మించి, తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తుంది. వరి పంటలో పంజాబ్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి అందించిన ప్రొత్సహమే. పెట్టుబడి ఎకరాకు 10 వేలు రైతు బంధు వేస్తూ రైతు బంధువుగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేటితో 50 వేల కోట్ల పంట పెట్టుబడి సహాయం అందించటంతో ఊరూరా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. లక్ష కోట్లతో మూడేళ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచిన ముఖ్యమంత్రి గారు. మీ ఆశీర్వదాలే కేసీఆర్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. ఎవరెన్ని కుట్రలు చేసిన రైతుల నుండి,తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని విడదీయలేరు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ... రైతును రాజుగా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే,దేశంలోనే ప్రథములులు.. నేడు రాష్ట్రంలో రైతులు ఆనందం లో ఉన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మంత్రి సబితా రెడ్డికి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నాగలి బహుకరించిన రైతులు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, డిసీసీబీ, డిసిఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఎంపీపీ, జడ్పీటీసీ లు, మార్కెట్ చైర్మన్లు, రైతు బంధు చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, మునిసిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.