కనీస వేతనాలు అమలు చేయాలి

Published: Wednesday July 27, 2022

మంచిర్యాల టౌన్, జూలై 26, ప్రజాపాలన : కనీస వేతనాలు అమలు చేయాలని సోమవారం రోజున సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, కనీస వేతనాల పెంపుపై 5 రంగాలకు, ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్స్ కు గెజిట్ ఇవ్వాలని, 73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని, కనీస వేతనంగా 26,000/- నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, బీడి కార్మికులందరికీ జీవన బృతి ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి , సింగరేణి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజినల్ అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ , శ్రీరాంపూర్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి మహేందర్,సమ్మన్న, తిరుపతి, సంపత్, రవీందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.