తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ* *ప్రజల వద్దకు ఆర్టీసీ

Published: Wednesday March 01, 2023
 *ప్రజా పాలన షాబాద్* ::= *దూరాలను దగ్గర చేస్తూ మీ అవసరాలకు ఆసరాగా 90 సంవత్సరాలుగా  సురక్షిత సేవలందిస్తూ మీ మనసు గెలుచుకున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రజా జీవితంలో ప్రధాన భాగమైన ప్రజా రవాణా సంస్థ ఈ సంస్థ అంతరించిపోకుండా ఆరాధించండి ఆశీర్వదించండి ప్రోత్సహించండి అంటూ టి ఎస్ ఆర్ టి సి షాద్నగర్ డిపో మేనేజర్ ఉష ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ ప్రోగ్రాంని షాబాద్ మండల్ మన్మరి గ్రామంలో నిర్వహించడం జరిగింది* *ఈ ప్రోగ్రాంలో భాగంగా డిపో మేనేజర్ ఉషా మాట్లాడుతూ రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని అందులో ప్రభుత్వ రవాణా అనేది ప్రజలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ధ్యేయంగా  టీ ఎస్ ఆర్ టి సి పనిచేస్తుంది ఆర్టీసీ వల్ల వికలాంగులకు గాని స్త్రీలకు వృద్ధులకు విద్యార్థినీ విద్యార్థులకు స్పెషల్ కన్సిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టీ బస్సుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ప్రమాదం జరిగిన వ్యక్తులకు నష్టపరిహారం చెల్లిస్తుంది ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణం ప్రైవేట్ వాహనాల ప్రయాణం ప్రమాదకరమైన ప్రయాణం అందుకని ఆర్టీసీనీ నష్టాల ఊబిలో కూరుకు పోకుండా ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలి కోవిడ్ టైంలో సొంత వాహనాలు ఎక్కువ కొనుకోవటం జరిగింది ఈ సొంత వాహనాలు ఉపయోగించుకోవడం వలన అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు ఉపయోగించుకోవడం వలన టిఎస్ఆర్టిసి ఎంతగానో నష్టపోతుంది కాబట్టి టీ ఎస్ ఆర్ టి సి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు అదేవిధంగా మన్మరి గ్రామానికి ఏ ఏ సమయాల్లో బస్సు అవసరం ఉందో ఏ సమయాల్లో బస్సులు నడిపితే ప్రయాణికులు ఎక్కువగా వస్తారో గ్రామ పెద్దలను అడిగి తెలుసుకున్నారు* *సర్పంచ్ సుహాసిని సత్యనారాయణ డిప్యూటీ సర్పంచ్ గోపాల్ అడ్వకేట్ నర్సింలు బేగారి అంజయ్య మాట్లాడుతూ మన్మరి గ్రామానికి బస్సు సౌకర్యం సరైన సమయానికి లేకపోవడం గ్రామ ప్రజలకు ఎంతో ఇబ్బందికరమైన విషయం  సరైన టైంలో బస్సు రాకపోవడం వలన మహిళలు విద్యార్థిని విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు వచ్చే బస్సు అన్ని గ్రామాల తిరుగుకుంటూ పోతే షాద్నగర్ పోయేవరకు గంట టైం పడుతుంది ఈ సమయపాలన ప్రయాణకులకు విసుగు తెప్పించే విధంగా ఉంది కాబట్టి బస్సు ప్రయాణం చేయలేకపోతున్నారు అని అన్నారు* *ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసిని సత్యనారాయణ డిప్యూటీ సర్పంచి గోపాల్ అడ్వకేట్ నర్సింలు బేగారి అంజయ్య బేగరి బందయ్యా డిపో మేనేజర్ ఉష అసిస్టెంట్ ఆనంద్ రావ్ సి ఆర్ సి వెంకటేష్ ఎస్ డీ ఐ అర్జున్ న్యూ అసిస్టెంట్ సుధాకర్ రంగాపురం వెంకటేష్ రంగపురం మహేష్ సతీష్ కావాలి మహేష్ కారోబార్ పరమేష్ కందివనం శంకరయ్య రామకృష్ణ ముశిలయ్య యాదయ్య శేఖర్ మల్లేష్ జటని అంజయ్య రామ్ రెడ్డి వెంకటేష్ బీరయ్య చంద్రయ్య శీను రామకృష్ణ బాలరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు*