ఆరోగ్య తెలంగానే కెసిఆర్ లక్ష్యం : సర్పంచ్ కోట విజయశాంతి వెంకట కృష్ణ

Published: Tuesday February 22, 2022
మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం దెందుకూరు గ్రామంలో సోమవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు సమగ్ర ఆరోగ్యసేవలు అందించి సమగ్ర సమాచార నిమిత్తం ఉపయోగపడే విధంగా జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ఆశ కార్యకర్తలకు అందవలసిన స్మోర్ట్ ఫోన్ లను పిహెచ్సి దెందుకూరు పరిధిలోని దెందుకూరు సబ్ సెంటర్ ఎఎన్ఎమ్ లకు డా వెంకటేష్ డా శశిదర్ సూచనలు మేరకు  దెందుకూరు సర్పంచ్ శ్రీ మతి కోట విజయశాంతి వెంకటకృష్ణ చేతులు మీద గా పిహెచ్సి దెందుకూరు నందు సోమవారం మధ్యాహ్నం ఆశ కార్యకర్తలకు అందించినారు. ఈ సందర్బంగా సర్పంచ్ విజయ్ శాంతి మాట్లాడుతూ ఆరోగ్యతెలంగాణగా మార్చటమే  కెసిఆర్  కె టీ ఆర్ లక్ష్యం అని అందుకోసం మారుమూల ప్రాంతంలో ప్రతి ఒక్క రికి సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించి ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు మొబైల్ ఫోన్ ద్వారా సమగ్ర సమాచారం సేకరణ నిమిత్తం ఉపయోగనిమిత్తం వాడాలని ఆమె తెలిపినారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి పబ్లిక్ హెల్త్ నర్స్ రమాదేవి మతా శిశు సమరక్షణ నోడల్ అధికారి  మరియు హెల్త్ విజిటర్ B కౌ సెల్య ఆశ నోడల్ పర్సన్ విజయకుమారి హెల్త్ సూపర్ వైజర్ లంకా కొండయ్య  ఎఎన్ఎమ్ లు భారతి జయమ్మ వై లక్ష్మి ఎఎన్ఎమ్ లు రాజేశ్వరి విజయ్ లక్ష్మి విజయ్ కుమారి నాగమణి రాజేశ్వరి దెందుకు రు మొదటి ఎఎన్ఎమ్ B ఆరుణ మరియు సునీలా రాణి హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరావు స్టాఫ్ నర్స్లు రజని సృజనా వినీల పాల్గొన్నారు.