మహిళ కాంగ్రెస్‌ అధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం..

Published: Monday February 07, 2022
ఖమ్మం ఫిబ్రవరి 6, ప్రజాపాలన ప్రతినిధి : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య  ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం లోని జడ్పీ సెంటర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి ర్యాలీగా తరలివెళ్లిన మహిళ కాంగ్రెస్‌ నాయకులు. కార్యకర్తలు అంబెడ్కర్పా విగ్రహానికి పాలతో అభిషేకం చెశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార మదంతో, నిరంకుశ స్వభావంతో భారతదేశ రాజ్యాంగాన్ని అవమానిస్తూ పత్రికా సమావేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు.. కెసిఆర్  దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహిళా  డిమాండ్ చెశారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ  భారత రాజ్యాంగాన్ని తెలుపుతూ  ఈ దేశంలోని గుళ్లోకి నాకు ప్రవేశం లేకపోయినా గాని ప్రజాస్వామ్యానికి పెద్ద గుడి అయినటువంటి పార్లమెంట్లో నాకు అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం అని కొనియాడారు. అటువంటి రాజ్యాంగం గురించి హేళన చేస్తూ కెసిఆర్ మాట్లాడిన విధానం సభ్య సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో పార్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముక్క శేఖర్ గౌడ్, నాయకులు వడ్డే నారాయణ రావు ఏలూరు రవి గారు దేవత శంకర్ నాయక్. రబ్బానీ. 57వ డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగం. కొనిజర్ల ఎంపీటీసీ స్వర్ణలత అమ్మపాలెం ఎంపీటీసీ అనూష తుమ్మల పల్లి సర్పంచ్ రేణుక ధనలక్ష్మి కృష్ణవేణి నాగమణి దివ్య రజిని తదితరులు పాల్గొన్నారు