షాపుల యజమానులు ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ లైసెన్స్ లు తీసుకోవాలి

Published: Thursday April 14, 2022
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత
బెల్లంపల్లి ఏప్రిల్ 13 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాల యజమానులు, ఏప్రిల్ నెల చివరి వరకు అన్ లైన్ లైసెన్సులు తీసుకోవాలని, తీసుకొని యెడల మునిసిపల్ చట్టం-2019 ప్రకారం వారిపై చర్య తీసుకోని వారి దుకాణమును "సీజ్" చేయబడునని బెల్లంపల్లి మునిసిపల్ కమీషనర్ జంపాల రజిత తెలిపారు. మంగళవారం నాడు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు, దుకాణాల యజమానులు వారి వారి దుకాణపు కొలతలు, మరియు ట్రేడ్ లైసెన్స్, లు ఆన్లైన్ లేని యెడల దుకాణ యజమానులపై 25 రేట్ల వరకు అదనంగా పెనాల్టీ విధించడం జరుగుతుందని, అలాగే పురపాలక శాఖ కమిషనర్, ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారం చేయుటకు, రహదారి వెడల్పు, వాణిజ్య కొలతల, ద్వారా లైసెన్స్ ఫీజు విధించబడునని  తెలిపారు. ప్రతి  దుకాణంలో తడి, పొడి మరియు హానికర చెత్తను వేరు చేయుటకు డస్ట్ బిన్స్, ను ఏర్పాటు చేసుకోవాలని, ఏర్పాటు చేసుకోకపోతే, మునిసిపల్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు, డస్ట్ బిన్స్ లేక పోతే 1000 నుండి 5000 -వరకు పెనాల్టీ వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.