హబ్సిగూడ డివిజన్లో రూ 70.5 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Friday November 18, 2022
మేడిపల్లి, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి)
 హబ్సిగూడ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ గురువారం పలు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చేతన హరీష్ ప్రారంభించారు. ఈ మేరకు డివిజన్లోని గణేష్ నగర్, గ్రీన్ హిల్స్ కాలనీలో ఫుట్ పాత్, రోడ్డు వైడనింగ్ మరియు గ్రీన్ బెల్ట్ కోసం రూ70.5 లక్షలతో  పనులకు భూమి పూజా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ చేతన్ హరీష్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ ఈఈ నాగేందర్, 
డీఈ నాగమణి, ఏఈ సాయి కుమార్, హబ్సిగూడ, రామంతాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బి.వి చారి, ఎండి ముస్తాక్, ప్రధాన కార్యదర్శులు కంచర్ల సోమిరెడ్డి,              జెసిబి రాజు, ఉపాధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, వనంపల్లి గోపాల్ రెడ్డి, నందికంటి శివ, బిజెపి నాయకులు సంజయ్ పటేల్, గంగా, యమునా, సరస్వతి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు వెంకట్ రెడ్డి, దిలీప్, రాధాకృష్ణ, అశోక్ రావు, రాజిరెడ్డి, నాగ సాయినాథ్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.