బెల్లంపల్లిలో మరో 20 కోట్ల భూ కుంభకోణం.

Published: Tuesday May 04, 2021

కబ్జా చేస్తున్న కెమికల్ కుంటను అడ్డుకోవాలి.

బెల్లంపల్లి మే 3 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాల్టీ  పరిధిలోని మెడికల్ కాలేజీ భవనం వెనుక భాగాన ఉన్న  కెమికల్ నీటి కుంటను  మండల రెవెన్యూ ,అటవీ ,మత్సశాఖ అనుమతి లేకుండా దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలోఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అనుచరులు కబ్జాచేస్తున్నారని బెల్లంపల్లి జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 20 సంవత్సరాలుగా స్థానిక మత్స్య సహకార సంఘం   ఆధ్వర్యంలో కెమికల్ కుంటలో ప్రభుత్వం వారిచ్చే చేపపిల్లలను పెంచుతూ జీవనోపాధి గడుపుతున్న కెమికల్ కుంటను ఎవరి ఆధీనంలో లేదని భావించి కబ్జా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారులు మున్సిపల్ అధికారులకు ప్రతి సంవత్సరం రుసుము కూడా చెల్లిస్తున్నారని అలాంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నీటి కుంట భూమిని కబ్జా చేయడం ఎంత వరకు సమంజసమని వారన్నారు. ఇటీవల జాతీయ బైపాస్ రోడ్డు మెడికల్ కాలేజీ వెనుక భాగంలో నుండి ఈ కుంటకు  ప్రక్క నుండి  రావడం వల్ల ఈ కుంటను కబ్జా చేయడానికి కబ్జాదారులు పూనుకున్నారని, ఈ రహదారి రావడం వల్ల ఈ భూమి ఎకరానికి దాదాపుగ కోటి 50లక్షల రూపాయల విలువ పెరిగిందని పేర్కొన్నారు. 16 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ భూమి దాదాపు 20 కొట్ల రూపాయల విలువగల భూమిని  కబ్జా చేయాలని నియోజక వర్గ ఆది నాయకుడి అనుచరులు చక చకా పనులు మొదలు పెట్టారని ఆరోపించారు. ఒక వైపు బెల్లంపల్లి మున్సిపాల్టీ పరిధిలో 170 పి పి లోని 944 ఎకరాల భూమి కాభ్జాకూ గురి అవుతుంది అని జాక్ ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో హై కోర్ట్ ను అశ్ర ఇంచగా1వ తేదిన కౌంటర్ ఫైల్ చేయాలని జిల్లా కలేక్టర్ కు ఆ ర్డి ఓ కు బెల్లంపల్లి తాసిల్దార్ కు నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపెల్లి వెంకటస్వామి సిపిఐ రాష్ట్ర నాయకులు, గెల్లీజయరాం యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,గుండా చంద్ర మాణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి, బత్తుల మధు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అమానుల్లాఖాన్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, గోగర్ల శంకర్ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాశీ సతీష్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మహమ్మద్ గౌస్ హెచ్ యంఎస్ నాయకులు, ఆడెపు మహేష్ బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. తదితరులు పాల్గొన్నారు.