తెలంగాణ లో 9.08 శాతం ఉన్న గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి అని MRO కి వినతి పత్రం సమర్పించి

Published: Thursday May 19, 2022
భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా వైరా టౌన్ అధ్యక్షులు వాంకుడొతు శ్రీను ఆద్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనులను చిన్న చూపు చూస్తూ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకుండా గిరిజనులను మోసం చేస్తోందని ఆరోపించారు 
భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 8ఏళ్ళు కావొస్తున్న గిరిజనులకు 10శాతం రిజర్వేషను కల్పించకపోవడం గిరిజనులంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపొ ఆర్డమవుతుంది అన్నారు దీని వల్ల గిరిజన బిడ్డలు విద్య,ఉపాధి,ఉద్యోగ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారు అని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం 10శాతం రెజర్వేషన్ అమలు చెయ్యక పోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గిరిజనుల ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం అని గిరిజనులందరిని ఏకం చేసి మీకు పెద్ద గుణపాఠం చెప్తాం అని డిమాండ్ చేశారు
 
ఈ కార్యక్రమంలో వైరా పట్టణ అధ్యక్షులు ఆలే భద్రయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గిరిజన మోర్చా అధ్యక్షులు వాంకుడొతు శ్రీను వైరా పట్టణ ప్రధాన కార్యదర్శులు మనుబోలు వెంకట కృష్ణ,పాపగంటి నరేష్ యువమోర్చా అధ్యక్షులు పిల్లి వెంకట సతీష్ కార్యదర్శి కొమ్ము విజయ్ తదితరులు పాల్గొన్నారు