ఘనంగా చెన్నారెడ్డి గూడ లో తీజ్ వేడుకలు

Published: Tuesday August 24, 2021
తీజ్ వేడుకలలో పాల్గొన్న జెడ్పిటిసి మర్రి నిత్య  నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 23 ప్రజా పాలన ప్రతినిధి : గిరిజన సాంప్రదాయ తీజ్ పండుగ వేడుకలో పాల్గొన్న మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడా లో సోమవారం గిరిజన  సంప్రదాయ తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చెన్నారెడ్డి గూడ లో గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి యువతుల నృత్యాలు ఆకట్టుకున్నాయని, డప్పు, వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపు కార్యక్రమం ఒక మహత్తర జాతరగా కొనసాగిందని అన్నారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మొలకల బుట్టలను చెరువులో నిమజ్జనం చేయడం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలని ఆయన తండా వాసులను గ్రామ పెద్దలను కోరారు. కన్నుల పండుగగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎంపీటీసీలు జయ నందం, మధుసూధన్ రెడ్డి, రాందాస్ నాయక్, స్థానిక సర్పంచ్ కిషన్ నాయక్, నాయకులు వెంకటేష్ యాదవ్, ఎంఎన్ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ రాములు, లక్ష్మణ్, పెంటయ్య, సురేష్, వెంకటేష్ గౌడ్, జంగయ్య, శ్రీశైలం, ప్రదీప్ రెడ్డి, సందీప్, శివ, గిరిజన సంఘం నాయకులు, యువకులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, ఎంఎన్ఆర్  టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.