*అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి* - సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

Published: Saturday January 21, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 20, ప్రజాపాలన : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్,  హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బెల్లంపల్లి కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షురాలు భానుమతి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు గత 40 సంవత్సరాలుగా పని చేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇతర రాష్ట్రాల లో రిటర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. మన  రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు   కల్పించడం లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 27 వ తేదీన జరిగే ఐ సి డి ఎస్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో శంకరమ్మ, అనురాధ,  మహేశ్వరీ, సరిత, సత్యవతి, పద్మావతి ఉమాదేవి, అరవింద, విజయ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.