పార్టీ మరే సమాలోచనాలు ఉంటే త్వరలో ప్రకటిస్త : ఎల్.రమణ

Published: Tuesday June 15, 2021
రాజకీయ భవిష్యత్తుకు పునాధి ఇచ్చింది టీడీపీయే - టి.టీడీపీ చీఫ్
జగిత్యాల, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సోమవారం రోజున ఆయన నివాసంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతు పార్టీ మారే అవకాశం ఉందని సోషల్ మీడియా మరియు వివిధ పత్రికలు టీవీలలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే పార్టీ మారే ఆలోచనలు ఉంటె టీడీపీ నాయకులతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని ఎల్. రమణ అన్నారు. 1994 లో రాజకీయ ఆరంగేట్రం ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారకరామారావు అని భవిష్యత్తును ఇచ్చి ఆదుకుంది నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎమ్మెల్యే మంత్రి ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో అవకాశాలు కల్పించిన టీడీపీ పార్టీ అని ఆర్థికంగా వ్యాపార పరంగా కుటుంబాన్ని ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. టీడీపీ పదిసార్లు బీఫామ్ ఇచ్చి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు. అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రమణ సమాధానాలు ఇస్తూ మారుతున్న రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పరిస్థితులు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వలను పార్టీలను దృష్టిలో పెట్టుకొని అన్ని విస్తృతంగా చర్చించిన తరువాతనే పార్టీ మరే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వస్తానని ఎల్.రమణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ మంత్రి పదవుల కోసం ఆశపడి పోయే రకం ఎల్.రమణ వ్యక్తిత్వం కాదని స్పష్టం చేశారు. బీజేపీ లేదా తెరాస ఏ పార్టీలో చేరుతారనేది కోస మెరుపు అయింది. ఈ కార్యక్రమంలో మంకాలి రాజన్న దయాల మాల్లారెడ్డి ఏలేటి సురేందర్ రెడ్డి చక్రపాణి నిరంజన్ కోరుకంటి రాము రమేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.