నేడు అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన

Published: Monday April 04, 2022
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 03 ఏప్రిల్ ప్రజాపాలన : అన్ని మండల కేంద్రాలలోని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వరుస ఆందోళనలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 6న అన్ని జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్ల దగ్గర నిరసనలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. సివిల్ సప్లై భవనము విద్యుత్ సౌధ ముట్టడిస్తామని వెల్లడించారు. రోజురోజుకు నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. విద్యుత్ సంస్థలు దివాలా దశలో ఉన్నాయని గుర్తు చేశారు. డిస్కమ్లకు ప్రభుత్వం సుమారు 15 వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని తెలిపారు. యూపీఏ-2 ప్రభుత్వంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద భారీగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టాడని విమర్శించారు. మెడ మీద కత్తి పెడితే సంతకం సంతకం చేశానని సీఎం కెసిఆర్ చెప్పడం విడ్డూరమని దెప్పిపొడిచారు. ఓట్ల కోసం ఉచితంగా ఇస్తామంటూ పన్నుల రూపంలో బాధపడుతున్నాడని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటూ సఖ్యతను ప్రదర్శించడం సమంజసం కాదని హెచ్చరించారు. అధికారంలో లేని వారు ధర్నా చేయడం సమంజసం కాదని అధికారంలో ఉన్నవారు ధర్నాలు నిరసనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శివారెడ్డి పేట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ జెడ్ పి టి సి మాజీ చైర్మన్ మైపాల్ రెడ్డి పెండ్యాల అనంతయ్య సతీష్ రెడ్డి ఇ సంతోష్ కుమార్ గౌడ్ కృష్ణారెడ్డి కిష్టారెడ్డి అనంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రఘువీరారెడ్డి డి రాములు చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.