పట్టణ ప్రగతితో అభివృద్ధి బాటలో పట్టణాలు మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday June 07, 2022
మేడిపల్లి, జూన్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన 1వ డివిజన్ కమలా నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ డా.పి. రామకృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు స్థానికంగా నెలకొన్న రక్షిత మంచినీరు, విద్యుత్, డ్రైనేజి, పారిశుధ్యం మొదలైన సమస్యలను అధికారులకు వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
 ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్ మాట్లాడుతూ పచ్చదనంతో నిండిన  పరిశుబ్రమైన పట్టణాల నిర్మాణమే పట్టణ ప్రగతి యొక్క ముఖ్య ఉద్ద్యేశం అని తెలిపారు.అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయల కల్పన,పారదర్శక పాలన అందించడానికి పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏర్పాటు చేసారని తద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం లబిస్తుందని పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ హరితహారం,పారిశుద్యం నిర్వహణలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని అదే స్పూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని సూచించారు.అదేవిదంగా గతంలో వచ్చిన వరద ముంపుకు శాశ్వత పరిష్కారం కొరకు “స్ట్రోం వాటర్ డ్రైన్” నిర్మాణానికి ఎస్ ఎన్ డి పి ద్వారా మంజూరైన రూ.110 కోట్ల రూపాయల నిధులు విడుదలై పనులు ప్రారంభించుకోవడం పట్ల మేయర్ జక్క వెంకట్ రెడ్డి,డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, పాలక మండలిని అభినందించారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ   
1వ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు,మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని అందుకోసం ఇప్పటికే రూ. 3.67కోట్లతో వివిధ కాలనీలలో సిసి రోడ్లు,భూగర్భ డ్రైనేజి,మంచి నీటి సరఫరా మొదలైన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అదేవిదంగా రూ. 27.70 లక్షల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయని. మరియు రూ. 2.03 కోట్ల పనులు కౌన్సిల్ ఆమోదం పొందాయని త్వరలోనే వాటిని  కూడా ప్రారంభించి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ప్రజలందరూ తడి,పొడి,హానికారక చెత్తను “సోర్స్ సేగ్రిగేషణ్” పద్దతి ద్వారా వేరు చేసి అందించాలని కోరారు.దీని ద్వారా పట్టణాన్ని 100% శాతం చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రత్యక్షంగా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలను సూచించారు. డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ  మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమిష్టి కృషితో పట్టణాన్ని హరితహారం,సానిటేషన్ లో  రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సీఐ గోవర్ధన గిరి, కో ఆప్షన్ సబ్యులు ఇర్ఫాన్, డిఈ శ్రీనివాస్,ఏఈ వినీల్, జలమండలి అధికారులు కార్తీక్ రెడ్డి,మానేజర్ రమ్య,విద్యుత్ అధికారులు,మున్సిపల్ అధికారులు సీనియర్ నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి,చెరుకు పెంటయ్య, టిఆర్ఎస్ మహిళా అద్యక్షురాలు నిర్మల,నాయకులు జావేద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.