కార్మిక రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు సమాధి కట్టాలి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి, నరసయ్య IFTU ర

Published: Monday February 22, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రజాపాలన: భారత కార్మిక సంఘాల సమైక్య ఇప్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి క్లాసులు, స్థానిక అంబేద్కర్ భవన్లో N. సంజీవ్, R. మధుసూదన్ రెడ్డి. అధ్యక్షతన జరిగినాయి. క్లాసులు ప్రారంభం ముందు IFTU జెండాను జిల్లా అధ్యక్షులు D. ప్రసాద్ ఆవిష్కరించారు, అనంతరం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు, వ్యతిరేక విధానాలను అమలు వస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను సౌకర్యాలను తూట్లు పొడిచిందని అన్నారు చట్టాల సవరణ లో కార్పోరేట్ శక్తులకు సార్వభౌమాధికారం ఇచ్చి కార్మికులను కార్పొరేట్ శక్తుల ముందు బానిసలుగా నిలబెట్టిందని అన్నారు కార్మిక వర్గం కొట్లాడి సాధించిన చట్టాలను మోదీ ప్రభుత్వం  ఎందుకు కు సవరించిందని కార్మిక చట్టాలే కాదు రైతాంగ కొత్త తీసుకువచ్చి తాకట్టు పెట్టాలని చూస్తున్నారు అని అన్నారు గత 85 రోజుల నుండి ఢిల్లీ కేంద్రంగా పెద్దఎత్తున రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు వారికి అండగా కార్మికవర్గం నిలబడాలని పిలుపునిచ్చారు కార్మిక కర్షక ఐక్యతతో కార్మిక రైతు వ్యతిరేక ప్రభుత్వాలను సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలకుఏకంగా విశాల కార్మిక ఉద్యమాలను నిర్మించాలని I F T U రాష్ట్ర సహాయ కార్యదర్శి G,రామయ్య. అన్నారు నిర్మాణం పని విధానం కార్మిక శ్రమశక్తి దోచుకుని దాచుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు మోకరిల్లి తున్నాయనికావున పటిష్టమైన నిర్మాణంలో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి గటించ గలమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు A. వెంకన్న, మధుసూదన్ రెడ్డి. యాకుబ్ షావలి. గోనెల రమేష్, ప్.సతీష్. చంద్రశేఖర్ మల్లెల వెంకటేశ్వర్లు గుండాల వెంకన్న సంజీవ్ తదితరులు పాల్గొన్నారు