తలస్సెమియా, సికిల్ సెల్ వ్యాది పై అవగాహణ సదస్సు

Published: Monday May 09, 2022
మంచిర్యాల టౌన్, మే 08, ప్రజాపాలన : తలస్సెమియా, సికిల్ సెల్  వ్యాది పై అవగాహణ సదస్సు ఆదివారం రోజున మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలస్సెమియా దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి  మంచిర్యాల జిల్లా శాఖ ఆద్వర్యంలో తలస్సేమియా, సికిల్ సెల్,  వ్యాది గ్రస్తుల కొరకు అవగాహణ సదస్సును ఎఫ్ సి ఐ కమ్యూనిటీ హాల్ మంచిర్యాల లో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అథితులుగా భారతి హోళ్ళికేరి ఐ.ఏ.ఎస్,  జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ మంచిర్యాల, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్. జి. సుబ్బా రాయుడు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మంచిర్యాల వచ్చారు. ఈ సందర్బంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంబించారు, అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు  మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలస్సెమియా నివారణ దినోత్సవంను పురస్కరించుకుని తలస్సెమియా సికిల్ సెల్ వ్యాదిని నిర్మూలించడానికి పెళ్ళికి ముందు యువతి యువకులు హెచ్ బి ఎ  2 టెస్టు చేసుకోవలని అన్నారు, అలాగే వ్యాది గ్రస్తులు 15 రోజులకు ఒక్కసారి జీవితాంతం రక్తం ఎక్కించాలని అందుకు వేసవి కాలంలో రక్తం కొరత ఎక్కువ ఉంటుందని, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తలస్సెమియాయ పిల్లల కొరకు రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తలస్సెమియా సికిల్ సెల్ వ్యాదిగ్రస్తులకు రెడ్ క్రాస్ సొసైటి ద్వారా ఆరోగ్యశ్రీ పథకంతో మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటి జిల్లా శాఖ తలస్సెమియా సికిల్ సెల్ వ్యాది గ్రస్తులకు అత్యవసర ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారందరికి సేవలు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తునదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ ఛైర్మన్  చందూరి మహేంధర్, జిల్లా కోశాధికారి పడాల రవీంధర్, కమిటీ సబ్యులు వి.మధుసూదన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ , కె.సత్యపాల్ రెడ్డి, ఎస్. నాగేంధర్ , యెడ్ల కిషన్, తలస్సేమియా, సికిల్ సెల్, సికిల్ తాల్ వ్యాది గ్రస్తులు, వారి తల్లి తండ్రులు, బందువులు తదితరులు పాల్గొన్నారు.