భరత్ పూర్వ విద్యార్థి మూడ్ సంపత్ కు అభినందనలు శీలం

Published: Friday January 20, 2023
వెంకటరెడ్డి మధిర జనవరి 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానికభరత్ విద్యాసంస్థలలో ఆరో తరగతి నుంచి చదివి ఎంబిబిఎస్ ఆర్ ఐ ఎం ఎస్ శ్రీకాకుళం నందు ఇటీవల కేజీహెచ్ వైజాగ్ నందు ఎమ్మెస్ జనరల్ సర్జన్ గా సీటు పొందిన మ్. సంపత్,  వంగవీడు గ్రామమునకు చెందిన మూడ్ బాలు కుమారుడుని భరత్ విద్యాసంస్థల డైరెక్టర్ శీలం వెంకట రెడ్డి, శీ లం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల  ప్రిన్సిపాల్ మాధవరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గడ్డం శ్రీహరి, ఆర్ట్స్ ఇంచార్జ్  అమర్నేని నవీన్ భరత్ స్కూల్ హెడ్మాస్టర్ కోటేశ్వరరావు, గణిత అధ్యాపకులు  కటికల రవీందర్ రెడ్డి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పేదరికంలో పుట్టినటువంటి సంపత్  పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీప్రిన్సిపాల్ నవీన్ మాధవ రెడ్డి సిబ్బందిి పాల్గొన్నారు