ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలకొట సర్పంచ్

Published: Monday March 13, 2023

బొనకల్ , మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి:గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో గ్రేస్ సర్వీస్ సొసైటీ ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆదివారం ఉదయం కలకోట గ్రామపంచాయతీలో సర్పంచ్ యంగల దయామని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు ఉచిత మెడికల్ క్యాంపును ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. డాక్టర్ సుధా మాట్లాడుతూ నిరక్షరాస్యలు అయిన మహిళలుకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎప్పటికప్పుడు వైద్యు పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని అన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు బృందం బీపీ, షుగర్, బెస్ట్ క్యాన్సర్ టెస్ట్, రాండమ్ బ్లడ్ షుగర్, అవసరం ఉన్నవారికి ఉచిత స్కానింగ్ , వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.కోఆర్డినేటర్ ఎర్నెస్ట పాల్ , పైడిపల్లి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ యంగల దయామని, డాక్టర్ సుధ, డాక్టర్ శ్రీకాంత్, కోఆర్డినేటర్ ఎర్నెస్ట్ పాల్, సాంకేతిక సిబ్బంది, విక్టర్ పాల్, జయపాల్ అసోసియేట్ ప్రొఫెసర్ అమరయ్య, కోటి, రత్నాకర్, మోహన్ రావు , చావా శేషగిరిరావు, రామకృష్ణ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.