ద్యాచారంలో 15 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం

Published: Saturday March 11, 2023

* శరీర అవయాలలో కళ్ళు ప్రధాన భాగం

* ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య
వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని యాచారం గ్రామ సర్పంచ్ ఎల్లన్నోళ్ల అంజయ్య అన్నారు. కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలను నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేశారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోగల ద్యాచారం గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు సిసి రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ ఎల్లన్నోళ్ల అంజయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, నియోజకవర్గ అభివృద్ధి నిధులతో సిసి రోడ్డు నిర్మాణం పనులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులు 15 లక్షలు,  నియోజకవర్గ అభివృద్ధి నిధులు 2.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నామని వివరించారు. మెయిన్ రోడ్డు నుండి క్రిమిటోరియం వరకు గ్రామపంచాయతీ నుండి క్రీడా ప్రాంగణం వరకు బోయిని నర్సింలు ఇంటి నుండి బోయిని అంజయ్య ఇంటి వరకు ఉరడి పార్వతమ్మ ఇంటి నుండి కావలి బాబు ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ నిధులతో మెయిన్ రోడ్డు నుండి క్రీడా ప్రాంగణం వరకు జిపి ముందు భాగం వరకు మొరం వేయించామని చెప్పారు. కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలను నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడే వారికి కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం మంచి ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుష్ప క్షేత్రపాలకుడు మహేందర్ కంటి పరీక్షల వైద్యురాలు సౌమ్య సూపర్వైజర్ మీనాక్షి ఆప్తమెటిక్ మమత డాటా ఎంట్రీ ఆపరేటర్ అజహర్ ఏఎన్ఎం ప్రేమకుమారి విజయలక్ష్మి ఆశ వర్కర్ స్వప్న అంగన్వాడీ టీచర్ యాదమ్మ దాచారం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.