ఆలేరు ఎన్.సి.సి. ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ

Published: Friday December 02, 2022
ఆలేరు ఎన్.సి.సి. ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ*
 
యాదాద్రి భువనగిరి జిల్లా 1 డిసెంబర్ ప్రజాపాలన:
 
 ఆలేరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ సీసీ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వందమంది  ఎన్.సి.సి.   విద్యార్థులు పట్టణ వీధుల గుండా ఎయిడ్స్ గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
 
ఎన్.సి.సి. ఉత్తమ అవార్డు గ్రహీత మరియు ఆలేరు ఎన్.సి.సి.అధికారి దూడల వెంకటేష్ మాట్లాడుతూ...
ఎయిడ్స్ ని పూర్తిగా నివారించే చికిత్స ప్రస్తుతానికి లేదని, ఈ మహమ్మారి సోకకుండా  ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. స్పర్శించడం వల్ల, వ్యాధిగ్రస్తుల బట్టలు ధరించడం వల్ల, వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సోకదని తెలిపారు.
 అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆలేరు ఎన్.సి.సి. అధికారి దూడల వెంకటేష్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఎయిడ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.  ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, సీనియర్ ఉపాధ్యాయులు కోటగిరి శేఖర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎయిడ్స్ ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారని కానీ శక్తివంతమైన ఏఆర్టి తదితర మందుల వల్ల అది మామూలు మధుమేహం హైపర్టెన్షన్ వ్యాధుల లాగే దీర్ఘకాలిక నియంత్రక వ్యాధిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
 రావి హరినాథ్ రెడ్డి, మంద సోమరాజులు మాట్లాడుతూ ఈ వ్యాధి హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుందని, ఎయిడ్స్ అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి బాహ్య కారణాలవల్ల తగ్గుతుందని, తద్వారా ఈ వ్యాధిగ్రస్తులు జలుబు తదితర అంటు రోగాల బారిన  పడె అవకాశం ఎక్కువగా  ఉందన్నారు.
 ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, విజయలక్ష్మి, కవిత, స్వర్ణలత, లక్ష్మమ్మ, మీరా, శేఖర్, హరినాథ్ రెడ్డి, సోమరాజు, మురళి, కాజా అలీ, సి ఆర్ పి తిరుపతి  తదితరులు పాల్గొన్నారు.