లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు సన్మానం మధిర

Published: Saturday October 08, 2022
అక్టోబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక 
ఇండియన్ పీనల్ కోడ్ ఏర్పాటై నేటికీ 162 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియన్ పీనల్ కోడ్ ని అమలుపరుస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ *మురళి* ని, మరియు టౌన్ ఎస్ఐ *సతీష్* గారిని ఘనంగా సత్కరించి స్వీట్లు పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా *లయన్స్ క్లబ్* అధ్యక్షులు చారుగుండ్ల వెంకటలక్ష్మి నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ ఆవిర్భవించి 162 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పీనల్ కోడ్గా ఉటంకిస్తూ మన భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు, శ్రీలంక మరికొన్ని దేశాలు కూడా మన కోడ్ని ఆధారంగా చేసుకుని వారు కూడా కోడ్ తయారు చేసుకోవటం జరిగిందని చెప్పినారు.ఈ కార్యక్రమంలో *లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్* అధ్యక్షులు చారుగుండ్ల వెంకటలక్ష్మి నరసింహారావు, ఉపాధ్యక్షులు కోనా ధని కుమార్, ప్రధాన కార్యదర్శి కుంచం కృష్ణారావు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు (సూరి), సహాయ కార్యదర్శి మహంకాళి వెంకట శ్రీనివాసరావు, చారుగుండ్ల లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.