మహిళలు ఆర్ధిక స్వాలంభన సాధించాలి.సేవా మండలి అధ్యక్షురాలు మచ్చా రేణుక..

Published: Tuesday August 31, 2021
పాలేరు ఆగస్ట్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : నేలకొండపల్లి మహిళలు ఆర్ధిక స్వాలంభన సాధించాలని నేలకొండపల్లి సేవా మండలి అధ్యక్షురాలు మచ్చా రేణుక సూచించారు. ఎస్బీఐ ద్వారా నిర్వహించిన జ్యూట్ బ్యాగ్ శిక్షణ ముగిసింది. సోమవారం మండల పరిషత్ కార్యాలయం లో సేవా మహిళ మండలి వారి ఆధ్వర్యంలో అభ్యర్ధులకు సర్టిఫికెట్ల ను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయం కృషి తో ఆర్ధికంగా ఎదగాలని సూచించారు. ఈ శిక్షణ తో సమాజం లో గౌరవం, కుటుంబ పోషణ కు ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజేంద్ర, కిషోర్, తహశీల్దార్ సుమ, ఐకేపీ ఏపీయం ఆశోక్ఆణి, ఈజీఎస్ ఏపీవో సునీత, సేవా మహిళ మండలి కార్యదర్శి జ్వాల తదితరులు పాల్గొన్నారు.