విద్యార్థుల ప్రాణాలు అధికారులకు పట్టవా ** కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్

Published: Monday March 06, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చ్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి) :
జిల్లాలో సంక్షేమ,గురుకుల, అశ్రమ,కస్తూరిబా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యాల మీద జిల్లా అధికారులకు పట్టింపు లేదని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన  సమావేశంలో దుర్గం దినకర్ మాట్లాడుతూ జిల్లాలో గత మూడు నెలల క్రితం ఓకె నెలలో ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో చనిపోయారని, జిల్లాలో పని చేస్తున్న అధికారులు సంక్షేమ హాస్టల్ లలో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల తిర్యాని లో కలుషిత నిరుతాగి విద్యార్థులు అస్వస్థత కు గురి కావడం జరిగిందని అన్నారు. గత వారం జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయ మూర్తి  పి టి జి గురుకుల విద్యార్థులు చదుకవుకుంటున్న పాఠశాలను పరిలించడం జరిగిందని, అక్కడ అపరిశుభ్రత వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారుని అన్నారు. జిల్లా కేంద్రంలోనే పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాలలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని, అంతే కాకుండా జిల్లాలో మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విద్యార్థుల తల్లితండ్రులతో సంక్షేమ అధికారులతో విద్యార్థి ప్రజా సంఘాల నాయకులతో  సమావేశం ఏర్పాటు చేయాలని ,విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్, గెడం తికనంద్, పాల్గొన్నారు.