పెన్షన్ల మంజూరీలో మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగలేదు కమిషనర్ రమాదేవి

Published: Monday August 29, 2022
మధిర ఆగస్టు 28 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడు మున్సిపల్ కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ ఆసరా పెన్షన్ లో ఎటువంటి అవినీతి జరగలేదని2021 ఆగస్టు నెలలో మీసేవ ద్వారా డైరెక్ట్ గా ఆన్లైన్ చేసుకున్న వారికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరి చేసింది.57 సంవత్సరాలు నిండిన వారికి ఇచ్చే పెన్షన్లలో మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు.సేర్ఫ్ ద్వారా పెన్షన్ల లబ్ధిదారులు ఎంపిక జరిగింది.అవినీతికి ఆస్కారం లేని మున్సిపాలిటీపై అసత్య ఆరోపణలు సరైనది కాదు.అర్హత ఉండి పెన్షన్ రాని వారు  మీ సేవ ద్వారా అప్లై చేసుకోగలరు.రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన లిస్టును మేం పబ్లిష్ చేసాం. మున్సిపల్ కమిషనర్ రమాదేవి మున్సిపాలిటీలో 57 సంవత్సరాల నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం అందించిన పెన్షన్ల విషయంలో అవినీతి జరిగిందని కొంతమంది ఆరోపిస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కానీ మున్సిపాలిటీలో పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 57 సంవత్సరాలు నిండిన వారు కి పెన్షన్ ఇస్తామని చెప్పటంతో 2021 ఆగస్టు నెల నుండి అర్హత ఉన్నవారు డైరెక్టుగా మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నీ సర్ప్ డిపార్ట్మెంట్కు వెళ్లి వాళ్లు పరిశీలించి తర్వాత లబ్ధిదారుల లిస్టులను ఖమ్మం డిఆర్డిఏ ఆఫీసుకు రావడం జరిగిందని అక్కడనుండి మున్సిపాలిటీలకు పంపించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.ఈ లిస్టు ఆధారంగా మున్సిపాలిటీలో 22 వార్డులలో వార్డుకు ఇద్దరు చొప్పున అసరా కార్డులను పంపణీ చేయటం జరిగిందని తెలిపారు. అంతే తప్ప ఈ పెన్షన్ల వ్యవహారంలో ఎక్కడ మున్సిపాలిటీ జోక్యం లేదని అనవసరంగా అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో తోటి మున్సిపాలిటీలతోపాటు మధిర మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఆరోపణలు చేయటం సరైన పద్ధతి కాదని దయచేసి ఆరోపణలు చేసేవారు వాస్తవాలు తెలుసుకొని చేస్తే మంచిదని సూచించారు. మీరు ఎలాంటి వార్తలు రాసేముందు అయినా మా వివరణ తీసుకొని రాయాలని మా వివరణ లేకుండా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు.
 
 
 
Attachments area