24 అవర్స్ సినిమాకు క్లాప్ కోట్టిన ఎమ్మెల్యే సంజయ్

Published: Saturday December 18, 2021

జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రముఖ దర్శకుడు రామ్ కుమార్ నిర్మాత కట్ట శివల సారథ్యంలో నిర్మిస్తున్న 24 అవర్స్ సినిమాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురువారం ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. స్థానిక భారతి పిల్లల ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన ముహూర్తం షాట్ కు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావం తర్వాత స్థానిక కళాకారులకు, చిన్న సినిమాల నిర్మాతలకు, దర్శకులకు మంచి అవకాశాలు వచ్చాయన్నారు. అలాగే లోకల్ తెలంగాణ పాటలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయన్నారు. జగిత్యాల వేదికగా సినిమాల నిర్మాణ ప్రక్రియ చాలా రోజులుగా సాగుతోందని ఈ సినిమా ప్రేక్షకుల ఆధారణ పొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో రామ్, హీరోయిన్ హాసిని, సెకండ్ హీరోయిన్ సాక్షి, జబర్దస్త్ కమెడియన్ చిట్టిబాబు లు పాల్గొనగా ఈ సినిమా షూటింగ్ జగిత్యాల లో 15 రోజులు కొనసాగుతుందని నిర్మాత, దర్శకులు తెలిపారు.