బెల్లంపల్లి లో అగ్నిపథ్ ను రద్దు చేయాలని నిరసన దీక్ష

Published: Tuesday June 28, 2022
బెల్లంపల్లి జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన "అగ్నిపథ్ " ను వెంటనే రద్దు చేయాలని బెల్లంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం  పార్టీ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు.
పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకటీ శ్రీనివాస్, అధ్యక్షతన జరిగిన సమావేశంలో  నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావుల పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి  రక్షణ బలగాలను అందించేందుకు,  తగిన పరీక్షలు నిర్వహించి, శిక్షణ ఇచ్చి సర్వీస్ అయిపోయేంత వరకు దేశ రక్షణ కోసం వారి సేవలను వినియోగించుకునే అవకాశం ఉండగా,  కేంద్ర బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించినట్లు, రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు వారికి అప్పగించేందుకు, నాలుగు సంవత్సరాల కాలపరిమితితో,  పరీక్షలు నిర్వహించి రిక్రూట్ చేసుకోవడం, చేసుకున్న వారిని నాలుగు సంవత్సరాల అనంతరం ఇంటికి తిరిగి పంపించడం, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
గతంలో తెచ్చిన నల్ల చట్టాలను ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, చేసిన న చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం రద్దు చేయక తప్పలేదని, అగ్నిపత్ పథకాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని, చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ చిలుముల శంకర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, తొంగల మల్లేష్, ఎం డి, నయిమ్, కౌన్సిలర్లు బండి ప్రభాకర్ ,మాజీ కౌన్సిలర్లు సతీష్, శ్రీనివాస్, రొడ్డ శ్యామ్,మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రోడ్డ శారద, గాదం శ్రీనివాస్, ఎనగందుల వెంకటేష్, కొలిపాక శ్రీనివాస్, పార్టీ యూత్, విద్యార్థి , మహిళ, కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area