ఏడు మండలాల ప్రధానోపాధ్యాయలతో జిల్లా విద్యాధికారి సమీక్ష సమావేశం

Published: Thursday November 25, 2021

కోరుట్ల, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామం శివారు లో గల శ్రీ రామ ఫంక్షన్ హాల్ లో ఏడు మండలాల (మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, మెట్పల్లి, మల్లాపూర్ ఇబ్రహీంపట్నం, రాయికల్) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్పెషలాఫీసర్ కేజీబీవీ లు, ప్రిన్సిపాల్ మోడల్ స్కూల్ వీరితో జిల్లా విద్యాధికారి జగిత్యాల జగన్మోహన్ రెడ్డి పాఠశాలల రికార్డులు రిజిస్టర్లు నిర్వహణ గురించి, పాఠశాల అభివృద్ధిలో, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తీసుకునే చర్యల గురించి మరియు రాబోయే మార్చి 2021 పరీక్షలకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఏడు మండలాల నుంచి 95 మంది ప్రధానోపాధ్యాయులకు 95 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం, రాయికల్ మండల విద్యాధికారి గంగాధర్, సెక్టోరియల్ అధికారి బాలకిషన్, ప్రధానోపాధ్యాయులు అంజా రెడ్డి, సంపత్ కుమార్ చారి పాల్గొన్నారు.