చిరు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ చిరు సన్మానం మధిర డిసెంబర్ 14

Published: Thursday December 15, 2022
చిరు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ చిరు సన్మానం మధిర డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు చిరు వ్యాపారస్తు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపల్ చైర్మన్ మొండితోకలత చిరు సన్మానం చేసిన చిరు వ్యాపారస్తు లు
ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూఇచ్చిన హామీ నెరవేర్చిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ,మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ కృతజ్ఞతలు తెలిపిన చిరు వ్యాపారులు అభినందనలు తెలిపి ఈ సందర్భంగా వారికి.ప్రత్యేక చొరవతో తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు  ఋణపడి ఉంటామని వెల్లడి చిరు వ్యాపారస్తు తెలిపారు ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు  .మధిర మున్సిపాలిటీ లో 80 మంది చిరు వ్యాపారులకు స్థలం కేటాయింపు.

మధిర పట్టణంలోని రోడ్ల వెంట ఉన్న చిరు వ్యాపారుల షాప్స్ తొలగించిన విషయం విదితమే అయితే ఆ సమయంలో ఆందోళనకు గురి అయిన వ్యాపారుల అందరికీ తమ వ్యాపారం కోసం అనువైన స్థలం కేటాయిస్తాం అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  హామీ ఇచ్చారు కమల్ రాజు  భరోసా తో చిరు వ్యాపారులు ధైర్యంగా ఉన్నారు వారికి ఇచ్చిన హామీ మేరకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  చిరు వ్యాపారులను, ప్రజాప్రతినిధులను తీసుకొని పలుమార్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ ,జిల్లా కలెక్టర్ ని కలసి వారికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు ఈ నేపథ్యంలో మధిర మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో 80 మంది చిరు వ్యాపారులకు స్థలం కేటాయించి వారికి అధికారులు అప్పగించారు దీనితో వారిలో ఆనందోత్సాహాలు నిండాయి వారి సమస్యను పరిష్కరించి అండగా నిలిచిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపల్ చైర్మన్ మొండితోకలత ని బుధవారం నాడు ఉదయం మధిర లోని ఆయన నివాసంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక చొరవ తో తమకు ఇచ్చిన హామీ నెరవేర్చిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు మున్సిపల్ చైర్మన్ మొండితోకలత  ఋణపడి ఉంటామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు కనుమూరు వెంకటేశ్వరరావు అరిగి శ్రీనివాస్ ఓంకార్ మేడికొండ కిరణ్ బి వి ఆర్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ పలువురు టిఆర్ఎస్ నాయకులు  ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.