బీరుపూరులో ఘనంగా రైతుబందు విజయోత్సవ సంబరాలు...

Published: Friday January 14, 2022

బీరుపూర్, జనవరి 13 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రైతుబందు సాంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబందు పెట్టుబడి ఆర్థిక సహాయం జనవరి 10 వరకు రైతన్నల ఖాతాలో 50 వేల కోట్ల రూపాయలకు చేరడంతో గ్రామంలో విజయోత్సవాల సంబరాలు జరుపుకున్నారు. రైతులకు రైతుభిమా తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పరమేష్ ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు బీరుపూర్ టెంపుల్ చైర్మన్ నెరేళ్ల సుమన్ గౌడ్ గ్రామ ఉప సర్పంచ్ చిర్నేని హరీష్ తెరాస అధ్యక్షుడు పూడూరి సుధాకర్ కృష్ణారావు రైతులు గ్రామస్తులు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.