జాతీయ ప్రతిభా ఉపకార వేతనానికి ఎంపికైన మాటూర్ హైస్కూల్ విద్యార్థి కందుల సిద్ధార్థ

Published: Wednesday June 16, 2021
మధిర, జూన్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, చెందిన విద్యార్థి కందుల సిద్ధార్థ గత నవంబర్లో నిర్వహించినటువంటి జాతీయ ప్రతిభా ఉపకారవేతనాల పరీక్ష నందు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీవి సాయికృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విద్యార్థికి ఈ ఉపకార వేతనం కింద ప్రతి సంవత్సరం 12 వేల చొప్పున నాలుగు సంవత్సరాలపాటు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ విద్యార్థి గతంలో కూడా గణితo లో చక్కటి ప్రతిభ చూపి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్నందు తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ ఉపకార వేతనాలు ఎంపికైన విద్యార్థిని గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, ఎస్ఎంసి చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.