జల్ శక్తి అభియాన్ సెంట్రల్ టీం పర్యటన

Published: Tuesday September 13, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజా పాలన : జిల్లాలో  జల్ శక్తి అభియాన్ సెంట్రల్ టీమ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన కమిటీ సభ్యులతో కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో  జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగినది.  ఈ సందర్బంగా జిల్లాలో  డి ఆర్ డి ఏ, ఇరిగేషన్, అటవీ శాఖ,పంచాయతీ రాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ నిర్వహించడం జరిగినది.  ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ, హరితహారంలో నాటిన మొక్కలు, హరితహారం నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, అమృత్ సరోవర్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఉపాధి హామీ పనులపై జల్ శక్తి అభియాన్ సభ్యులకు వివరించడం జరిగినది.  పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చూసిన కేంద్రం అధికారులు సంతృప్తి వ్యక్తపరిచారు.  ఈరోజు నుండి మూడు రోజుల పాటు జిల్లాలో చేపట్టిన వివిధ పనులను క్షేత్ర స్థాయిలో కేంద్ర సభ్యులు పరిశీలించనున్నట్లు వారు తెలిపారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా అధికారులు అందరు చేపట్టిన  పనులకు కేంద్ర జల శక్తి అధికారులకు క్షేత్ర స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జల్ శక్తి అభియాన్ డైరెక్టర్ మరియు నోడల్ ఆఫీసర్ రాకేష్ కటారియా, ప్రతాప్ సింగ్ సోలాంకి సైంటిస్ట్, డి ఆర్ డి ఓ కృష్ణన్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి,  జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, డీపీవో మల్లారెడ్డి, జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి దీపా, జిల్లా వైద్య అధికారి పాల్వాన్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area