ఇబ్రహీంపట్నం జూలై తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి. *ఇంటింటికి ఆరు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్

Published: Tuesday July 19, 2022

ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరగూడ గ్రామంలో హరితహారం లో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా సర్పంచుల సంఘం ఫోరం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి. అనంతరం ప్రతి సంవత్సరం లాగానే ప్రాథమికోన్నత పాఠశాలలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు నోటు పుస్తకాలు కామెంట్ బాక్స్ లు, టైలు, బెల్టులో అందజేశారు. గతంలో ఏడు నెలల కాలంలో చెక్ పవర్ లో లేని బూడిద రాంరెడ్డి సొంత నిధులతో స్కూలుకు కాంపౌండ్ వాల్ కట్టించారు.
230000 గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు కోసం వీరాళంగా అందజేశారు. గ్రామ శివారులో వెంచర్లు చేస్తున్న సందర్భంలో గ్రామ పంచాయతీకి పార్కు స్థలం లాంటి జాగాలు ఇవ్వడం సహజమే కానీ అటువంటివారటిని సైతం తన సొంత స్వలాభాలకు  వినియోగించుకోకుండా గ్రామ అభివృద్ధి తన ధ్యేయంగా 20 లక్షల రూపాయలు విరాళంగా గ్రామానికి వెంచర్ వాళ్ళ తరఫున గ్రామానికి ఇప్పించిన సంఘటన ఉప్పరిగూడ గ్రామపంచాయతీలోనే సాధ్యమని తెలియజేశారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్ కి సంబంధించిన సమస్యలను తీరుస్తానని గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి రిషిక నేత, ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ వెంకటేష్, పాఠశాల సిబ్బంది, ఉప సర్పంచ్ నరసింహారెడ్డి, వార్డు మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్ గోపాల్, సురేందర్ రెడ్డి, మోహన్ ,శ్రీనివాస్, జంగయ్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామ యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.