ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వైద్య అధికారులు

Published: Tuesday November 16, 2021
యాదాద్రి నవంబర్ 15 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిస్టిక్ లెప్రసి ఆఫీసర్ యాదాద్రి భువనగిరి జిల్లా డాక్టర్ వై పాపారావు మరియు సి హెచ్ ప్రశాంత్,పిఓడిటి మరియు స్పెషల్ డ్రైవ్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పించాలని, మొదటి మరియు 2వ డోసు ఇప్పించాలని, వ్యాక్సినేషన్ డ్యూ ఉన్నవాళ్లను ఫోన్ చేసి పిలిపించి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పించాలని 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్, డాక్టర్ వీణ, ఏ సంతోష్ కుమార్, ఏపిఎంఓ అనురాధ, సూపర్వైజర్ కే పద్మావతి, హెల్త్ అసిస్టెంట్ శ్రీలక్ష్మి, ఏఎన్ఎం శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ జయంతి, స్టాఫ్ నర్స్ ప్రీతం, ల్యాబ్ టెక్నీషియన్ సుశీల, ఫార్మసిస్ట్ ఆశ సబిత, సిబ్బంది పాల్గొన్నారు.